VijayaKumar

Apr 25 2024, 16:44

భువనగిరిలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం: భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1 తారీకు నుండి 8 తారీకు వరకు జరిగే కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని కోరారు మరియు మే 3 వ తేదీన చౌటుప్పల్ లో జరిగే బారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ గారు హాజరవుతారు ఈసభను విజయవంతం చేయాలని కోరారు ,అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గెలుపు కూడా బూత్ ఓటర్ల పైన వుంటుంది కాబట్టి రానున్న భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బూత్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ పైన వుందని అన్నారు, కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యార్ధించాలని అన్నారు,తెలంగాణ ఓటర్లు బిజెపి వైపు వున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి గౌడ్ సీనియర్ నాయకులు బందారపు రాములు మండల ఉపాధ్యక్షులు డోగ్పర్తి సంతోష్,గంగదారి దయాకర్, కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ ,మండల కార్యదర్శులు మందుల నాగరాజు , BJYM బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేగురి అమరేందర్, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు దంతూరి అరుణ్,బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, ,కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం బూత్ అద్యక్షులు బొంత భాస్కర్, భిక్షపతి , తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 25 2024, 10:53

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా, రామన్నపేట మండలంలోని పలు గ్రామాలలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారితో కలిసి నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం, బోగారం, వెల్లంకి, సిరిపురం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు.. 

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల్ల ప్రజాప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

VijayaKumar

Apr 25 2024, 08:10

ఇంటర్ ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల లో మండల ర్యాంకులు సాధించారు. 

ఎంపీసీ సెకండ్ ఇయర్ లో ప్రణీత 906 ,భవ్య 883, 

 బైపిసి సెకండియర్ లో దుర్గాప్రసాద్ 878 ,సురేఖ 829,  

సీఈసీ సెకండ్ ఇయర్ లో శివరంజని 737 

ప్రథమ సంవత్సరం బైపిసి లో గోరి నజ్రిన్ 395 ,శృతి 394, నజ్మా 326 ,ఇస్రాత్ బేబీ 304 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపల్ ,అధ్యాపక బృందం అభినందించారు.

VijayaKumar

Apr 25 2024, 07:17

బ్యాంకు నగదు కాజేసి ఆన్లైన్ బెట్టింగ్లులో పెట్టుబడి పెట్టిన క్యాషియర్ అరెస్ట్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకులో నగదు కాజేసి పరారైన క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. క్యాషియర్ అనిల్ కుమార్ రూపాయలు 15 లక్షల 50 వేల రూపాయలు నగదులో కొరత ఏర్పడగా బ్యాంక్ మేనేజర్ జి మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 16న పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.37,63,000 ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

VijayaKumar

Apr 25 2024, 06:52

వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల రాత్రి 8 గంటలకు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం అనే కార్యక్రమం అకాడమిక్ క్యాలెండర్ లో భాగంగా నిర్వహించే కార్యక్రమం అని అన్నారు . వీటి వలన విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలుకి తీయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వర్, శ్రీనివాస్ ,స్వప్న ,కిష్టయ్య ,గీతారెడ్డి ,సంతోష ,విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 24 2024, 13:52

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల భారీ మెజార్టీతో గెలుపు తథ్యం :పూస బాలమణి ఎంపీపీరామన్నపేట


  భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి వారి దీవెనలు తీసుకొని నామినేషన్ దాకాలు చేసిన శుభ సందర్బంగా వారికి శుభాకాంక్షలు అబినందనలు తెలియజేస్తూ 

nsui నాయకుని నుంచి mp గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది కష్ట పడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు తెచ్చే పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా 

మా రామన్నపేట మండలం లో కాంగ్రెస్ క్యాడర్ చాలా బలమైనది వేముల వీరేశం గారికి మా మండలం నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చినమో అదేవిధంగా చామాలకు ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా మా కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారు బిజెపి ది అసత్య ప్రచారలే పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి అభివృద్ధి చేసింది ఏమి లేదు దేశం బాగుపడాలంటే బడుగుబలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉండాలి. గతం లో ఎంపీటీసీ గా మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభిరుద్ది చేసిన మా నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటాం అని అన్నారు.

VijayaKumar

Apr 24 2024, 13:32

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మ్మెల్యేలు


భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ,ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ,నకిరెకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ . నామినేషన్ కి ముందు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలు చామల కిరణ్ కుమార్ రెడ్డి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.

VijayaKumar

Apr 24 2024, 07:32

వలిగొండలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సాయుధ బలగాలతో దాసిరెడ్డిగూడెం రోడ్డు నుండి తొర్రూర్ క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు ఎన్నికలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కవాతులు నిర్వహిస్తున్నామన్నారు ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభ పెట్టకుండా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా జరగకుండా అడ్డుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై డి మహేందర్ తో పాటు ప్రత్యేక సాయుధ బలగాలు, వలిగొండ పోలీసులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 23 2024, 18:58

భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని ఇంటింటికి ప్రచారం


సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగిర్ ని గెలిపించాలని ఈరోజు బోనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న ఎండి జాంగిరి చిన్నతనం నుండి ఉపాధి హామీ కూలీల కోసం రైతుల కోసం కార్మికుల కోసం నిరుద్యోగ సమస్యలపై అదేవిధంగా కాలువల కావాలని బసాపురం రిజర్వాయర్ నుండి వడపర్తి గతంలోకి నీళ్లు తేవాలని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కావున ప్రజలందరూ ఎండి జాంగిర్ కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే భువనగిరి పార్లమెంటును అభివృద్ధి పథంలో చేస్తారని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య గ్రామ నాయకులు పాండాల ఆంజనేయులు మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 23 2024, 17:28

భువనగిరి లో వీర హనుమాన్ విజయ యాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయత్ర బైక్ ర్యాలీ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు భువనగిరి పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పోతనక్ రాఘవేందర్ గారు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు బైక్ ర్యాలీ పట్టణంలో పురవీధుల గుండా తిరిగి జగదేవపూర్ రోడ్డులో గల అంజనాద్రి హనుమాన్ దేవాలయం వద్ద ముగిసింది స్థానిక వినాయక చౌరస్తా వద్ద హిందుత్వవాది చికోటి ప్రవీణ్ హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ హిందూ వ్యతిరేకులు హిందూ సమాజంపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీరత్వం విశ్వరూపం చూపుదాం పౌరుషం పరాక్రమం ప్రదర్శించుదాం అని పిలుపునిచ్చారు హిందూ యువకులను పోరాట యోధులుగా తయారు చేయడం కోసం బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ద్వారా చైతన్యవంతులై హిందూ యువకులు గోరక్ష మతమార్పిడులు మరియు లవ్ జిహాద్ ల నుంచి హిందూ ఆడపిల్లలను సంరక్షించుకోవడం కోసం చైతన్యాన్ని పొంది ప్రతి హిందూ యువకుడు పని చేయాలని పిలుపునిచ్చారు హిందువులంటే కేవలం సౌమ్యంగా ఉండేవారు మాత్రమే కాదని హిందూ దేవతల్లాగా ఆయుధాలను చేపట్టి ధర్మాన్ని కాపాడడం కోసం దుష్ట శిక్షణ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సహకార్యదర్శి తోట భాను ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జగదేపూర్ రోడ్డులో ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ముగింపు జరిగే అంజనాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల ఉద్దేశించి భువనగిరి పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా మనం ఇలా శోభాయాత్ర చేసుకుంటున్నారని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని పిలుపునిచ్చారు హిందువుగా పుట్టినందుకు హిందువునని ప్రతి హిందువు గర్వపడాలని అప్పుడే ఇతర మతాలను తను గౌరవించగలడని తెలిపారు కార్యక్రమంలో బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను ప్రసాద్ కో కన్వీనర్ మార్కాశ్రవణ్ కోకల సందీప్ పొన్నాల వినయ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నమిలే నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ వెల్దుర్తి అవినాష్ జడల అక్షయ్ విశ్వహిందూ పరిషత్ కార్య అధ్యక్షులు పోల శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యక్షులు పసుపునూరి మనోహర్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ పట్టణ కార్యదర్శి సాల్వేర్ వేణు జిల్లా మందిర్ అర్చక పురోహిత్ ప్రముక్ ఆకుల అనిల్ సహా కార్యదర్శి పోచంగళ్ళ బాబు జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు సంతోష్ రెడ్డి యాదాద్రి ప్రఖండ అద్యక్షులు ఎరుకల అనిల్ మండల అధ్యక్షులు గుండె శ్రీరాములు సహకార దర్శి రేడ్డబోయిన బాలరాజు పూస శ్రీనివాస్ దొమ్మాటి ప్రసాద్ బింగి భరత్ సండే మయూర్ ఉడుత గణేష్ బానోతు కిట్టు శ్రవణ్ కుమార్ శ్రీరామ్ శ్రీనివాస్ చారి వల్లబోజు సతీష్ జిల్లా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు హిందూ సంగటిత శక్తి ప్రదర్శన నినాదంతో చేపట్టిన వీర హనుమాన్ విజయ యాత్రను యువకుల శక్తి ప్రదర్శనతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన విశ్వహిందూ పరిషత్ నాయకులు.